టీవీలు, సెల్ ఫోన్లు దూరం పెట్టండి.

share on facebook
– కళాశాల అధ్యాపకులు వంద శాతం‌ఫలితాలు తేవాలి.
– వంద శాతం రిజల్ట్స్ రాకపోతే కళాశాలకు నిధులు కట్
– బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు‌.
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(జనంసాక్షి) డిసెంబరు 19:
ఇంటర్ విద్యార్థుల్లారా.. ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు. పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి.! టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండి.! పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి.! మంచి మార్కులతో పాసయి తల్లి దండ్రులకు మంచి పేరు‌ తేవాలి. ఈ ఏడాది ఇంటర్ లో‌వందకు వంద శాతం ఫలితాలుండాలని ఇంటర్ విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా మాన కొండూరు నియోజక వర్గంలోని బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం ఉదయం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి వివేకానందుడి విగ్రహాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం బెజ్జంకి మండల‌కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అసలు పాస్ అవడం కోసం‌ చదవడమేంటనీ., ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలంటూ.. నిత్యం విజ్ఞానాన్ని పొందాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బెజ్జంకి ‌కళాశాలో‌ ఎకనమిక్స్, కామర్స్, సివిక్స్ సబ్జెక్టు లలో గత ఏడాది‌ తక్కువ మార్కులు వచ్చాయని, ఈ సారి ఈ‌సబ్జెక్టుల్లో విద్యార్థులు వందకు వంద శాతం పాస్ కావాలంటూ.. ఈ మేరకు మాట ఇవ్వాలని లెక్చరర్లు‌, విద్యార్థులు మాట ఇవ్వాలని., కోరగా అందుకు ప్రతిగా విద్యార్థులు, లెక్చరర్లు‌ మంత్రి మాట ఇచ్చారు. నిన్న 49  మంది విద్యార్థులు రాలేదు. ఇవాళ‌ 29 మంది రాలేదని., విద్యార్థులు కాలేజీ మానవద్దని,  లెక్చరర్లు కొద్ది మంది విద్యార్థులను కేటాయించి వారు తప్పనిసరిగా కాలేజీకి హాజరయ్యేలా పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తల్లిదండ్రులను కలిసి‌ కళాశాలకు హజరయ్యేలా సమావేశాలు నిర్వహించాలని., కళాశాలకు రాని విద్యార్థుల జాబితా సిద్ధం చేసి గ్రామ సర్పంచ్ ల సాయం తీసుకోని… విద్యార్థులు కళాశాలకు వచ్చేలా చూడాలని మంత్రి కోరారు. విద్యా శాఖాధికారులు ప్రతీ రోజు నాలుగు కళాశాలలు తిరిగాలని., విద్యార్థులు చదువుతున్నారా.?  లేదా..? కళాశాలకు వస్తున్నారా..?  లేదా..?  అన్న విషయాలు పరిశీలించాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులను వ్యవసాయ పనులకు పంపోద్దని., తానే స్వయంగా మీ తల్లి దండ్రులకు లేఖలు రాయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇవాళ్టి నుండి మద్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నాం. రేపటి నుండి సాయింత్రం స్నాక్స్, టిఫిన్ ఏర్పాటు చేస్తామని,  సాయింత్రం ఇక్కడే‌ విద్యార్థులను రెండు గంటల‌సేపు చదివించాలని సూచించారు. అదనపు తరగతి గదులు కావాలని కోరారు. అందుకు‌ రూ.40 లక్షల రూపాయలు అవసరం ఉంటాయని., మీరు వందకు వంద శాతం పాసయితే వెంటనే‌ అదనపు  గదులకు అవసరమైన రూ.40లక్షలు నిధులు ఇస్తానని., లేదంటే నిధులు కట్ అంటూ వంద శాతం పాస్ అవుతామని ప్రామీస్ చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల చేత ప్రామీస్ చేయించారు. ఏదేమైనా జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బెజ్జంకి కళాశాల తొలి‌ స్థానంలో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సర్పంచ్ ద్యావన పల్లి మంజుల శ్రీకాంత్, ఇతర ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.