డిప్యూటేషన్ వెనక్కి తీసుకోవాలని స్టూడెంట్ డిమాండ్.

కూకట్ పల్లి,జనంసాక్షి :
జేఎన్ టీయూహెచ్ ఓఎస్డీ స్థూడెంట్స్ ఎఫైర్ బానోత్ ధర్మానాయక్ డిప్యూటేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏవీఎన్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు జేఎన్టీయూ విద్యార్థులు. అంతకు ముందు బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మా నాయక్ ను డిప్యూటేషన్ మీద వేరే చోటకు పంపవద్దని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. అతన్ని జేఎన్ టీయూ నుండి రిలీవ్ చేయొద్దని రిజిస్టార్ మంజూర్ హుస్సేన్ కి కూడా వినతిపత్రం సమర్పించారు. ధర్మా నాయక్ వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి ఎన్నో సమస్యలు కొలిక్కి వచ్చాయని, హాస్టళ్లలో వసతులు మెరుగయ్యాయని ఇలాంటి తరుణంలో మంచి అధికారిని వేరే చోటకు పంపడం సరికాదని విద్యార్థులు కోరారు.