తెలంగాణలో కొత్త మోటార్ చట్టం అమలుకు ‘నో’
హైదరాబాద్: కొత్త మోటర్ వెహికిల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చట్టాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలోగా సింగూర్‌లో కాళేశ్వరం నీళ్లు నింపుతామని వెల్లడించారు. సంగారెడ్డికి త్వరలోనే మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. సంగారెడ్డి మహబూబ్‌సాగర్ చెరువును పూడిక తీసి గోదావరి నీటితో నింపుతామని తెలిపారు.