నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.

share on facebook
దౌల్తాబాద్,జూన్ 27 జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. దీంతో ప్రయాణికులు రోడ్డు పైన నిలబడి బస్సులు ఎక్కుతున్నారు.నిత్యం గజ్వేల్ టూ రామయంపేట్ రూట్ లో అరగంటకు ఒక బస్సు నడుస్తున్న ఒక్క బస్సు కూడా ప్రయాణ ప్రాంగణం లోకి రావడం లేదు. నిత్యం మండల కేంద్రం నుంచి గజ్వేల్,రామాయంపేట, సిద్దిపేట, మెదక్ కు ప్రయాణికులు వెళ్తుంటారు. కానీ బస్సులు మాత్రం శివాజీ చౌరస్తాలో రోడ్డుపైనే అగుతున్నాయి. పలుమార్లు గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో అధికారులకు చెప్పితే అధికారులు వచ్చి పరిశీలించారు. ప్రయాణ ప్రాంగణం లోకి వెళ్లాలని బస్సు డ్రైవర్, కండక్టర్ లకు సూచించారు లేదంటే జరిమానా విధిస్సమని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులు పాటించి,మళ్లీ రోడ్డుపైనే ఆపుతున్నారు.ప్రయాణ ప్రాంగణం మాత్రం రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. దీని పై అధికారులు దృష్టి పెట్టి ప్రయాణ ప్రాంగణం లోకి బస్సులు రావాలని విద్యార్థులు, ప్రయాణికులు,ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
 

Other News

Comments are closed.