పదహారుకు దగ్గరగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: ఎర్రబెల్లి

share on facebook

వరంగల్‌,మే20(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తమకు దగ్గరాగా ఉన్నాయని, అయినా తాము అనుకున్న 16సీట్లు గెలవబోతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కారుసారు,పదహారు నఅ/-న నినాదాం బాగా పనిచేసిందన్నారు. తమ లక్ష్యం మేరకు 16 సీట్లు రాబోతున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం ఖాయమైందని, కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కదని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే హావా కొనసాగుతోందని అన్నారు. వరంగల్‌ స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఉనికి కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. గెలవమనే విషయం కాంగ్రెస్‌ నాయకులకు తెలుసని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హావిూ ఇచ్చారు.

Other News

Comments are closed.