పాలమూరులో గెలుస్తున్నాం: ఆచారి

share on facebook

మహబూబ్‌నగర్‌,మే22(జ‌నంసాక్షి): పాలమూరు ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో తమకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆచారి అభిప్రాయపడ్డారు. ఇక్కడి నుంచి డికె అరుణ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో నాలుగైదు సీట్లు గెలుస్తామని అన్నారు. ఇదిలావుంటే ఓటమి భయంతో ఉన్న  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అతిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత ఎద్దేవా చేశారు. ఏపీలో తన పార్టీ ఘోరంగా ఓడిపోతుందని జాతీయ విూడియా సర్వేలన్నీ తేల్చి చెబుతున్న సందర్భంలో దాన్ని కప్పిబుచ్చుకునేందుకు ఢిల్లీ వేదికగా ఆయన హంగామా చేస్తున్నారని   విమర్శించారు. మోడీతో లాభం పొంది మోడీనే విమర్విస్తూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌
ఫలితాలను చూసిన తర్వాత మోదీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఇతర పార్టీ నేతల మాట ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం ఎగ్జిట్‌ ఫలితాల తర్వాత నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. బాబు డ్రామాలన్నింటికీ ఈనెల 23న తెరపడుతుందని, మోదీ
నేతృత్వంలో బీజేపీ మరోమారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. పాలమూరులో తమ సత్తా చూపుతామని అన్నారు. గురువారం జరిగే ఓట్ల లెక్కింపులో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి 17వ లోక్‌సభకు తమ ప్రతినిధిగా ఎవరన్నది తేలిపోనుంది.

Other News

Comments are closed.