పోలవరంపై తప్పుడు కూతలు మానుకోవాలి

share on facebook

జగన్‌కు దేవినేని తీవ్ర హెచ్చరిక

విజయవాడ,జూన్‌14(జ‌నం సాక్షి): పోలవరం, అమరావతి రెండు సినిమాలంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం గురించి ఏవిూ తెలియకుండా విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌లో నిత్యం 9 వేల మంది పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు 24వేల మంది పోలవరాన్ని సందర్శించారని తెలిపారు. పోలవరం సినిమా అనడానికి జగన్‌కు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌పై జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరావతిని భ్రమరావతి అనడం శోచనీయమన్నారు. ఏపీ రాజధానిని జగన్‌ ఇడుపులపాయలో కట్టాలనుకున్నారని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కన్నాకు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే టీడీపీలో చేరేవారని ఎద్దేవా చేశారు. 100కార్లతో జగన్‌ పార్టీలోకి వెళ్లేందుకు కన్నా సిద్ధపడ్డారని దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు. సీటు ఇస్తే మా పార్టీలోకి వస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ.. ఢిల్లీ వెళ్లి మాపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు మా నిజాయితీ గురించి మాట్లాడితే ప్రజలు నమ్మరని అన్నారు. ఒకసారి వీరంతా పోలవరం వెల్లి ఏం జరుగుతుందో చూసి రావాలన్నారు. పోలవరంలో రూ. 9 వేల కోట్ల పనులు జరిగితే సినిమాతో పోల్చడమేంటని అన్నారు. మానసిక సమస్య ఉంటే జగన్‌, వైద్యుడిని సంప్రదించాలి.. కానీ, కార్మికులు, ఇంజినీర్ల కష్టాన్ని అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇక వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన దేవినేని.. సాయిరెడ్డి లాంటి దొంగకి పోలవరం పనులపై మేం ఒట్టేసి చెప్పాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం అనుకున్న స్థాయిలో లేదన్నారు దేవినేని… గోదావరి డెల్టాకు జూన్‌లో ఇప్పటికే 5 టీఎంసీల నీరు విడుదల చేశామని… గోదావరి ప్రవాహం పెరిగిన తర్వాతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తామన్నారు.

జగన్‌కు ఏం తెలుసు: గోరంట్ల

హత్యా రాజకీయాలు జగన్‌ వారసత్వమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ మైనింగ్‌ మాఫియాను అడ్డుకుంటున్నారని పరిటాల రవిని హత్య చేయించారని ఆరోపించారు. హత్య కోసం జగన్‌ అధునాతన ఆయుధాలు తెప్పించారన్నారు. పరిటాల రవి హత్యపై అసెంబ్లీలో మాట్లాడితే జగన్‌ పారిపోయారని గుర్తుచేశారు. రాజమండ్రిలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని గోరంట్ల అన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో పోలవరంనిర్మితమవుతుంటే ఆరోపణలు చేయడం తగదన్నారు. జగన్‌ కేసుల మాఫీకోసం బీజేపీ మానసపుత్రుడిగా మారారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు

 

Other News

Comments are closed.