ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం 30 రోజులు కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు.  కొత్తగా ఏర్పడిన తెలంగాణలోని ప్లలెలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ సమగ్ర గ్రామాభివృద్ధికి రూపకల్పన చేశారని అన్నారు. 30 రోజుల్లో ప్రధానంగా ఐదు అంశాల పై దృష్టి సారించాలని, అందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కో రారు. పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్‌ వాడకం, సం పూర్ణ అక్షరాస్యత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందిం చాలని సూచించారు. గ్రామసభల్లో సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో ఉన్న ఎన్నారైలు, గ్రామస్తుల ద్వారా విరాళాలు సేకరించి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. దాతల పేర్లను గ్రామ పంచాయతీ వద్ద నోటీస్‌ బోర్డుపై ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ప్రత్యేక ని ధులతో పనులు పూర్తి చేసి చెరువులను నింపుతామని హావిూ ఇచ్చారు. రూ. 50 వేల కోట్లతో కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మాణం జరిగిందని, దీంతో 365 రోజులు చెరువులను నింపే అవకాశం ఉందన్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, యూత్‌ నాయకులు గ్రామాభివృద్ధికి సహరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్లలెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పా టుపడుతూ దేశంలోనే నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.