ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలి
;బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి
ఎల్బీ నగర్ ( జననం సాక్షి ) ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలని బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు . మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని బాలాపూర్ మండల కేంద్రంలో మున్సిపల్ నాయకులు రామిడి శేఖర్ రెడ్డి, ఎం ప్రభాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధాని మోడీ పిలుపుమేరకు ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఈ కార్యక్రమంలో భాగంగా బాలాపూర్ లోని బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి స్వగృహం పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసిన, అనంతరం శంకర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించింది 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా యావత్ దేశం ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలి అన్నారు, జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం అంటే తల్లి భారతి కి వందనం చేయడమే అన్నారు, 75 సంవత్సరాల జాతీయ స్వతంత్రం వచ్చిన ఈ విషయంలో ఇంకా అక్కడ అక్కడ దేశ వ్యతిరేక చీడ పురుగులు ఉండడం చాలా బాధాకరమన్నారు, కులాలు మతాలు వర్గాల లతో, రాజకీయాలు జరగడం సిగ్గుచేటన్నారు, జగన్ కోసం ఇవన్నీ పక్కనపెట్టి భారత జాతికి భారతమాతకు సేవచేసే త్యాగబుద్ధి అందరిలో రావాలని ఆన్నారు, ఈ సందర్భంగా బాలాపూర్ గ్రామంలోని ప్రజలకు ఇంటింటికి జాతీయ పతాకాలను ఉచితంగా తన సొంత ఖర్చులతో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు సర్వేష్ పెద్ద సుధాకర్, అర్జున్ గౌడ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు
![]() |