బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు గా మనియర్ పల్లి నర్సమ్మ

share on facebook

బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు గా మనియర్ పల్లి నర్సమ్మ
జహీరాబాద్ నవంబర్ 2 (జనంసాక్షి) బహుజన హక్కులు, ఆత్మగౌరవం, బహుజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేద్దాం అని బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు మనియర్ పల్లి నర్సమ్మ అన్నారు.సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గా మనియర్ పల్లి నర్సమ్మ ను నియమిస్తూ బి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్తరి మహేష్ నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఈ సందర్భంగా నర్సమ్మ
మాట్లాడుతూ అందరూ తన మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతీ పథకాన్ని పేద ప్రజలకు సైతం అందిస్తూ,ఎస్సి ఎస్టీ బిసి వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Other News

Comments are closed.