భూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌

share on facebook

జనగామ కలెక్టర్‌ నిర్ణయంతో రైతుల్లో ఆనందం

జనగామ,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పలు కారణాలతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ కాకుండా మిగిలి ఉన్న భూములపై విచారణకు కలెక్టరేట్‌ ఆవరణలో రైతులకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహిస్తున్నారు. మండలానికో డేట్‌ కేటాయించి సమస్యలు ఉన్నరైతులను పిలిపిస్తుననారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణాడ్డి రైతుల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించారు. ఇప్పటికే పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి పెండింగ్‌ దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. ల్గ/తులు ముందస్తు సమాచారంతో రావాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు. ఏమైనా కోర్టు కేసులు ఉంటే వాటిని ఎలా పరిష్కరించవచ్చనే దానిపై రైతులకు కలెక్టర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ కార్యక్రమం అన్ని మండలాల రైతుల పెండింగ్‌ పాసు పుస్తకాల సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతుందని, రైతులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనతోపాటు రైతులను స్వయంగా కలిసి నేరుగా వారి సమస్యలు పరిష్కరించే దిశగా జిల్లాలోని మండలాల వారీగా రెండురోజులకో మండలాన్ని ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నుట్లు తెలిపారు. అప్పటికప్పుడు సమస్య పరిష్కారమయ్యే వాటిని పరిష్కరించి కోర్టు సమస్యలు ఉన్న భూములకు సంబంధించి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

Other News

Comments are closed.