మార్కెట్‌ యార్డులో జెండా ఆవిష్కరణ

share on facebook

తిరుపతి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనాలు సమర్పించారు. తిరుచానూరు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్‌లోని కొందరు రైతులకు తీపి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు మార్కెట్‌ యార్డు కమిటీ సభ్యులు, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.