మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో రక్షా బంధన్ పండుగ

share on facebook
భువనగిరి. జనం సాక్షి.
భువనగిరి పట్టణ 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి  సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో రక్షాబంధన్ పండుగను జరుపుకున్న స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ కార్మికులకు రక్షాబంధన్ కట్టి మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ ఎంతో పవిత్రమైన అన్నాచెల్లెళ్ల సంబంధం ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండడానికి చిహ్నం అని పట్టణాన్ని అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ల ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో రక్షాబంధన్ పండుగ జరుపుకుంటున్న అందుకు చాలా సంతోషంగా ఉందని కరోనా సమయంలో కూడా పారిశుద్ధ కార్మికులు భయపడకుండా జాగ్రత్తలు పాటిస్తూ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అనునిత్యం పారిశుధ్యం చేయడంలో చాలా క్రియాశీలంగా వ్యవహరించాలని అన్నారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ నాయకులు  నరేందర్ ప్రభాకర్ సాయి మున్సిపల్ జవాన్ కూరెళ్ళ యాదగిరి గంగారం నర్సింగ్ రావు కార్మికులు పెంబర్తి రాజేష్ మేడి మహేష్ పడిగెల మైసయ్య ఇటుకల రాజలింగం నరేందర్ దండు నరసింహ స్వామి అంజయ్య మల్లేష్ నిర్మల రేణుక లక్ష్మమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.

Other News

Comments are closed.