రైతుదిగుతూ కిందపడ్డ మహిళ

share on facebook

స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కాయి
రాంచీ,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కింద పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకొని స్వల్పగాయాలతో బయటపడింది. కదులుతున్న రైలు నుంచి వ్యతిరేక దిశలో ఆమె దిగేందుకు ప్రయత్నించింది. అనుకోకుండా ఆమె రైలు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కొని రైలుకిందకి జారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెకు ఏమై ఉంటుందోనని ఆందోళన చెందారు. అయితే రైలు వెళ్లిపోయిన అనంతరం స్వల్పగాయాలతో పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంపైకి చేరడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Other News

Comments are closed.