ల్యాండర్‌ కు ప్రమాదం లేదన్న ఇస్రో

share on facebook

బెంగళూరు,సెప్టెంబర్‌9

చంద్రయాన్‌2 ప్రాజెక్టుకు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై కూలిన విషయం తెలిసిందే. సాప్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో టెక్నికల్‌ సమస్య తలెత్తడంతో
దాని నుంచి సిగ్నల్స్‌ కట్‌ అయ్యాయి. చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 2.1 కిలోవిూటర్ల దూరంలో ఉన్నప్పుడు విక్రమ్‌ గతి తప్పింది. అయితే ల్యాండర్‌ కిందపడ్డా.. దానికి ఎటువంటి నష్టం జరగలేదని ఇస్రో వర్గాలు పేర్కొంటున్నాయి. హార్డ్‌ ల్యాండింగ్‌ జరిగినా.. విక్రమ్‌ ల్యాండర్‌ ముక్కలు కాలేదని తెలుస్తోంది. ఇస్రో అనుకున్న ప్రాంతంలో విక్రమ్‌ దిగకపోయినా.. అది పడ్డ ప్రాంతంలో మాత్రం పక్కకు ఒరిగినట్టుగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిజానికి విక్రమ్‌ ల్యాండర్‌కు ఏమైందన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా.. కమ్యూనికేషన్‌ పునరుద్దరించేంత వరకు ఏవిూ చెప్పలేమని ఇస్రో వర్గాలు తెలిపాయి. విక్రమ్‌ కూలి రెండు రోజులు గడుస్తోంది. ఇంకా 12 రోజుల పాటు దాని సంకేతాల గురించి ప్రయత్నించ నున్నట్లు ఇస్రో చెబుతోంది. విక్రమ్‌ సరిగా ఉంటేనే.. దాంట్లో ఉన్న రోవర్‌ ప్రజ్ఞాన్‌ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

Other News

Comments are closed.