వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

share on facebook


సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వరి పంట వేయడానికి ఆసక్తి చూపుతున్నారని అది కాకుండా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. దీంతో ఆర్థికంగా లాభాలు
పండుతాయన్నారు. పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సామం ఇస్తోందని అన్నారు.
రైతులకు వాణిజ్య పంటల సాగుకు అన్ని రకాల సబ్సిడీలను, రుణాలను అందిస్తామని చెప్పారు. బ్యాంకులు పాడి పరిశ్రమకు సంబంధించి కూడా లోన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాణిజ్య పంటలను పండిరచడంతో రైతుల ఆర్థిక అభివృద్ధితో పాటు దేశ ఆర్థికాభివృద్ధి కూడా మెరుగుపడుతుందని సూచించారు. వాణిజ్య పంటల గురించి, వాటికి సంబంధించిన రుణ అవకాశాల గురించి రైతులకు తెలపాలని నాబార్డు అధికారులు సూచించారు.

Other News

Comments are closed.