విద్యుదాఘాతానికి మహిళారైతు మృతి

share on facebook

శ్రీకాకుళం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గార మండలంలోని కొర్లాం గ్రామానికి చెందిన కొర్లాపు అప్పన్నమ్మ(40) అనే మహిళ సోమవారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పైనుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తెగి ఆమె విూద పడింది. దీంతో అప్పన్నమ్మ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

Other News

Comments are closed.