విూ చెల్లినడుగు.. బీజేపీ ఎక్కడుందో తెలుస్తోంది

share on facebook

– జేపీ నడ్డా ఎవరో తెలియదనటం కేటీఆర్‌కే చెల్లుతుంది
– ఎన్నోసార్లు ఢిల్లీలో ఎంపీలతో కలిసి నడ్డాను కలవలేదా?
– 2023లో తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ టార్గెట్‌
– హైదరాబాద్‌ను యూటీ వార్తలు అవాస్తవమే
– కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సోషల్‌ విూడియాలో జరగవు
– అమరావతి కేంద్ర పరిధిలోని అంశం కాదు
– రాజధాని ఎక్కడ కట్టుకోవాలనేది వారిష్టం
– ప్రైవేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ఈఎస్‌ఐ రోగులకు సేవలందిస్తోంది
– ఎస్‌ఐ ఆసుపత్రికి నిధులు కొరత లేకుండా చూస్తాం
– కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
– మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని ప్రారంభించిన కేంద్ర మంత్రులు
హైదరాబాద్‌, ఆగస్టు21 (జనంసాక్షి) : బీజేపీ తెలంగాణలో ఎక్కడుంది అని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని, స్వయంగా తన చెల్లి కవితను అడిగితే  బీజేపీ ఎక్కడుందో తెలుస్తుందని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి
కిషన్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సంతోష్‌ గంగ్వార్‌, కిషన్‌
రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో మెడికల్‌ కాలేజ్‌, ఆసుపత్రిని నిర్మించగా.. రూ.150 కోట్లతో ఓపీడీ బ్లాక్‌కు కూడా కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని కార్మిక లోకానికి అంకితం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు సనత్‌ నగర్‌ మెడికల్‌ కళాశాలలో సీట్లు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ఈఎస్‌ఐ రోగులకు సేవలందిస్తోందన్నారు. ఎస్‌ఐ ఆసుపత్రికి నిధులు కొరత లేకుండా చూస్తామన్నారు. కార్మికులు, ప్రజల ఆరోగ్య విషయంలో ప్రధాని మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. తెలంగాణకు కేంద్రం ఎయిమ్స్‌ కళాశాలను మంజూరు చేసిందని.. మహిళలకు మెటర్నటీ సెలవులను 12నుంచి 26వారాలకు పెంచిందని కిషన్‌రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల్లో భూమి సమస్య వలన ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఈఎస్‌ఐకు అప్పగిస్తే… వెంటనే ఆసుపత్రుల నిర్మాణం మెదలు పెడతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలసి పని చేసి ఈఎస్‌ఐ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతల తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందో విూ చెల్లి కవితను అడిగితే చెప్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఏడు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో టీఆర్‌ఎస్‌ నేతలకు మతి భ్రమించిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌లా తాము అహంపూరిత వ్యాఖ్యలు చేయబోమన్నారు. జేపీ నడ్డా ఎవరో తెలియదనటం కేటీఆర్‌కే చెల్లిందన్నారు. ఎన్నో సార్లు ఢిల్లీలో ఎంపీలతో కలిసి కేటీఆర్‌ నడ్డాను కలవలేదా? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయం అని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ టార్గెట్‌ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సోషల్‌ విూడియాలో జరగవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని మార్పుపై కిషన్‌ రెడ్డి స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి కేంద్రం పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ కట్టుకోవాలనేది వారి ఇష్టం విూద ఆధారపడి ఉంటుందన్నారు.
గిప్ట్‌గా ఇస్తానంటే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు – దత్తాత్రేయ
తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేశానని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సనత్‌నగర్‌ మెడికల్‌ కళాశాలను గిప్ట్‌గా ఇస్తానంటే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. కేంద్రం చొరవతో ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాల పూర్తి చేశామన్నారు. సనత్‌నగర్‌ ఆస్పత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ మెడికల్‌ కళాశాల అవుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

Other News

Comments are closed.