సంక్షేమంలో ముందున్నాం 

share on facebook

అందుకే ఎమ్మెల్యేలుచేరుతున్నారు: టిఆర్‌ఎస్‌
ఖమ్మం,జూన్‌7(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మాజీ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. అందుకే కాంగ్రెస్‌కుచెందిన ఎమ్మెల్యేలు తమకుతాము పార్టీలో ఏరేందుకు ముందుకు వచ్చారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక పథకాలన్ని ప్రారంబించాక ప్రజల్లో మంచి స్పందన వస్తోందిన శుక్రవారంనాడిక్కడ అన్నారు.  సిఎం కెసిఆర్‌  కాలంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారని  అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ వెనకడుగు వేయదని అర్హులైన వారికి పథకాలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తమ నియోజకవర్గాల్లో పథకాలు అమలయి అభివృద్ది చెందాలఅన్న ఆకాంక్షతో పలువురు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ విమర్శలుచేయడం దారుణమని అన్నారు.

Other News

Comments are closed.