సంపూర్ణ స్వచ్ఛత దిశగా జనగామ

share on facebook

వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు

జనగామ,నవంబర్‌21 (జనం సాక్షి)  : సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీ అన్నారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే ఓడీఎఫ్‌ గ్రామాలు సాధ్యమవుతాయని అన్నారు. జిల్లాలో వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని అన్నారు. సర్పంచ్‌లు ఎంపీటీసీలు భాగస్వామ్యం కావాలన్నా రు. అంగన్‌వాడీ టీచర్లు డీలర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విూషన్‌భగీరథ, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పలుగ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతమైందని ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి పోటీతత్వంతో నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. అనుకున్న మేరకు మరుగుదొడ్లు నిర్మించినట్లయితే వందశాతం పూర్తి అవుతాయని ఆయన తెలిపారు. ఇదిలావుంటే సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే అనేక గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా రూపుదిద్దు కున్నాయన్నారు. మండలంలో జరగుతున్న నిర్మాణౄలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నర్మెట, తరిగొప్పుల మండలాల్లో 18 గ్రామాలకు గానూ ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని, మిగతా 30శాతం మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందు కెళ్లాలని అన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన విూషన్‌ భగీరథ పనులు, మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. డిసెంబర్‌ 31లోగా విూషన్‌ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలని ఆదేశించారు. విూషన్‌ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వ హిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Other News

Comments are closed.