సొంతూళ్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి

share on facebook

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి గల్లిగల్లీలో గడప గడపకూ తిరిగి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాలి నడకన కలియతిరుగుతూ ప్రతీ ఒక్కరినీ పేరు పేరున పలుకరించి వారి మంచి చెడును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఊరిలోని రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. గ్రామ పర్యటనలో ఓ ఆసరా పింఛన్‌ దారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును సన్మానించాడు.

Other News

Comments are closed.