Main

తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు: కాంగ్రెస్‌

మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్టాన్న్రి కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే కడుపు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాజీ ఎమ్మెల్యే,పిసిసి అధకిరా ప్రతినిధి ఎ.శశిధర్‌ రెడ్డి అన్నారు. రైతుల పరిస్థితులను పట్టించుకోని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ నిధులు విడుదలయ్యే వరకు ఉద్యమాన్ని … వివరాలు

మేకల మందపై చిరుత దాడి.. 20 మృతి

రంగారెడ్డి : యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిరుత సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని … వివరాలు

కాళేశ్వరంపై మంత్రి హరీశ్ కీలక సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పంప్ హౌజ్ ల నిర్మాణం 2018 మార్చి చివరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 2018 జూన్ కల్లా మొత్తం పనులు పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ లోని జలసౌధలో ఈ ప్రాజెక్టు పనులపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వివిధ దేశాలకు చెందిన పుంపులు, … వివరాలు

చిన్నారి కోసం సహాయక చర్యలు ముమ్మరం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలోని ఓ పొలంలో బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీసేందుకు సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చిన్నారి సుమారు 40 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించిన సహాయ సిబ్బంది ఆమెను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రొకెయిన్ల సాయంతో బోరుబావికి సమాంతరంగా భారీ గొయ్యి తవ్వుతున్నారు. ఆక్సిజన్‌ పైపుల … వివరాలు

రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి..

 హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో కారులోనే ఉంచి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అయితే రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో చిన్నారి ఉండటాన్ని స్థానికులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. … వివరాలు

అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామజ్యోతి ద్వారా అన్ని రకాల నిధులను పంచాయతీ ఖాతాలో జమ … వివరాలు

రంగారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం

రంగారెడ్డి : జిల్లాలోని చెంగిచెర్లలో అనుమతి లేని లేఔట్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టివేశారు. 28 డిటోనేటర్లు, 50 కిలోల కాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: శంషాబాద్‌ కాపుగడ్డలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసింది.తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మహిళను ఆస్పత్రికి తరలించారు. 

ప్రభుత్వ భూములకు కంచె

రంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు  కంచెలు ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ  భూముల వద్ద అవసరమైతే బోర్డులు పాతాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, సమస్యల … వివరాలు

ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలోని సప్తగిరి ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కంపెనీలోని యంత్రాలు, ప్లాస్టిక్ స్టాక్ దహనంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.