అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం
అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): శ్రీరామ నవమి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ బ్రాహ్మణ కళ్యాణ మంటపంలో సూర్యాపేట బ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర రావు ఆద్వర్యంలో సీతారాముల కళ్యాణంను వైభవంగా నిర్వహించారు.పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు, సీతమ్మ వారిని వివాహమాడే తంతును పురోహితుడు బ్రహ్మశ్రీ పులి రోహిత్ శర్మ వేదమంత్రాల పఠనతో, భక్తుల జైశ్రీరామ్ నినాదాల మద్య అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రముఖులు డాక్టర్ రామయ్య, ఆకునూరు పాండురంగారావు, టేకులపల్లి శ్రీనివాస రావు, కట్టెకోల పూర్ణచందర్ రావు, బంధకవి కృష్ణ మోహన్, ఆదుర్తి రమేష్, అక్కిరాజు దుర్గా ప్రసాద్, తడకమళ్ళ కృపాకర్ రావు, కట్టెకోల శ్రీమన్నారాయణ, కోటంరాజు వేంకటేశ్వర రావు, తుంగతుర్తి వెంకటేశ్వర రావు, సరికొండ శ్రవణ్ కుమార్, పి.లక్ష్మీనారాయణ,గర్నెపూడి సురేష్, వేముగంటి దయాకర్ రావు,పులి అచ్యుతరామశర్మ తదితరులు పాల్గొన్నారు.