అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్‌ పోటీలకు అశ్వినీకుమార్‌ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 12 (: అంతర్రాష్ట్ర ‘5ఎ సైడ్‌’ ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా నుంచి ఎస్‌.అశ్వినీకుమార్‌ రాష్ట్ర జట్టు సభ్యునిగా ఎంపికైనట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఫుట్‌బాల్‌ శిక్షకులు జగన్మోహన్‌రావు తెలిపారు. ఈ పోటీలు హైదరాబాద్‌లో ఈ నెల 14వ తేదీవరకు జరగనున్నాయి. అశ్వినీకుమార్‌ ఎంపికపై జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఎల్‌.దేవానందం, ఓలంపిక్‌ సంఘం కార్యదర్శి సుందరరావు, శిక్షకులు జగన్మోహన్‌రావు తదితరులు అభినందించారు.