అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ ఖరారు.

హైదరాబాద్‌: అంతర జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూల్‌ ఖరారు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది. పరిమిత కాలానికి వీటిని అనుమతించనున్నారు. ఈ నెల 29 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, డిసెంబరు 22 నాటికల్లా ప్రక్రియ ముగించాలని అందులో స్పష్టం చేశారు.