అంతిమంగా ధర్మం, నాయమే గెలుస్తుంది: విజయమ్మ

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌  విజయమ్మ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యలయంలో అ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుందని కేవలం జగన్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో తెలియదని రాజకీయానేతలెందరిపైనో ఆరోపణలు వచ్చాయని మరి వారిని ఎందుకు విచారించటంలేదని అన్నారు. జగన్‌ను క్రిమినల్స్‌ను తీసుకెళ్ళే వ్యాన్‌లో తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులను సీబీఐ తప్పుదోవ పట్టీస్తుందని జగన్‌కు ప్రాణహాని ఉందని ఆమె అన్నారు. చంద్రబాబు ఆస్తులపై నెల రోజులు దాటిన విచారణ  ప్రారంభం కాలేదని కాని జగన్‌ విషయంలో మాత్రం వెంటనే ప్రారంభించారని ఈ విషయంపై ఢిల్లీలోని నేతలకు తెలిపామని ఈ రెండు నెలల నుంచి మా కుటుంబాన్ని మరింతగ వేదిస్తున్నారని ఉప ఎన్నికల్లో విజయం సాధించి పెట్టి ఇవ్వటం ద్వారా జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఉప ఎన్నికల్లో విజయం సాధించటంలో అందరి పాత్ర ఉందని కోర్టులపై నమ్మకం ఉందని అంతిమంగా ధర్మం, నాయమే గెలుస్తుందని అన్నారు.