అందరివాడు డిఎన్ఆర్..

share on facebook

అందరివాడు డిఎన్ఆర్..
ఊరుకొండ, డిసెంబర్ 2 (జనంసాక్షి):
పార్టీలకతీతంగా కుల మత బేద తారతమ్యం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరివాడు అనిపించుకుంటున్న మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) గొప్ప నాయకుడని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండలంలోని మాధారం మాధారం గ్రామానికి చెందిన అంకూరి సుశీలమ్మ(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, నిఖిలన్న యువసేన పేరిట రూ.5వేల తక్షణ ఆర్థికసహాయం అందజేశారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నిఖిలన్న యువసేన పేరిట, నిరుపేద కుటుంబీకుల అంతిమ సంస్కారాలకు 5వెలు మరియు నిరుపేద కుటుంబ అడబిడ్డలకు పెళ్లికానుకల పేరిట 5వేలు తక్షణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు తెలియజేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.