“అంధత్వం నిర్మూలనయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
ఫోటో రైట్ అప్: అన్నారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ నెమ్మాదిబిక్షం
పెన్ పహాడ్. మార్చి 10 (జనం సాక్షి) : అంధత్వ నిర్మూలనయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ నెమ్మాది బిక్షం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపుతో బాధపడుతున్న వారి కళ్ళల్లో వెలుగు నింపడానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కంటి వెలుగును గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ధనియాకుల కోటమ్మ సత్యనారాయణ, చెన్ను శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ స్రవంతి, స్వాతి,బిందు,శ్రీలేఖ. నాయకులు మండాది పిచ్చయ్య ,మామిడి శోభన్ బాబు ,సోషల్ మీడియా కోఆర్డినేటర్ వీరబోయిన రవి ,నకేరకoటి బుజ్జయ్య, అధికారులు ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు…