అంధత్వ నివారణ సంస్థ సర్వసభ్య సమావేశం

హైదరాబాద్‌: అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ తొమ్మిదో సర్వసభ్య సమావేశం ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో జరగనున్నట్లు ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ గుళ్లపల్లి ఎన్‌. రావు తెలిపారు. అందరికీ మెరుగైన కంటిచూపు నినాదంతో ఈ సమావేశంలో 66దేశాలనుంచి 1500మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. 120 మంది వ్యక్తులు 50కి పైగా సదస్సులు నిర్వహిస్తారన్నారు. శుక్లాలు, మధుమెహం, రెటినోపతి వంటి నేత్ర సమస్యల పరిష్కారం కోసం ఈ సదస్సు ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.