అంబరాన్నంటిన వాసవి క్లబ్  మహిళా దినోత్సవ వేడుకలు

*అంబరాన్నంటిన వాసవి క్లబ్  మహిళా దినోత్సవ వేడుకలు*
.. మహిళా అధికారులు , ప్రజాప్రతినిధులు,అంగన్వాడి సిబ్బందికి సన్మానంనేరేడుచర్ల మార్చి 24(జనంసాక్షి) న్యూస్…ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని నానుడి నేడు మారిందని ప్రతి మహిళ విజయం వెనుక ఓ మగవాడు ఉన్నాడనేలా మహిళలు అన్ని రంగాలలో దూసుకెళుతున్నారని,మహిళలు చేయి చేయి కలిపితే అసాధ్యమన్నదే లేదని వాసవి క్లబ్ విజయవాడ డిస్టిక్ గవర్నర్ మిత్తింటి శారద కొనియాడారు.గురువారం స్థానిక టౌన్ హాలులో వాసవి, వనితా క్లబ్ లు  సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా గవర్నర్ వంగవీటి గురుమూర్తి తో కలసి  ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.మగవారు ఎక్కువ మహిళలు ఎక్కువ అనే తారతమ్యం లేదని ఇద్దరూ కలిస్తేనే పరిపూర్ణ విజయం సిద్ధిస్తుందన్నారు.ఆర్యవైశ్యులకు దాన గుణం ఎక్కువ అని అన్నారు.ఇదే వరవడిలో వాసవి క్లబ్ లో ఆర్థిక సహకారం ఆర్యవైశ్యులే అందిస్తుండగా సేవలు అందరికీ అందించడం జరుగుతుందన్నారు. 62 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర గుప్త విగ్రహాన్ని త్వరలో కోదాడ పట్టణంలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.నేరేడుచర్ల వాసవి మరియు వనితా క్లబ్బులు చేపడుతున్న సేవలు ప్రశంసనీయమని మరింత విస్తృతస్థాయిలో చేపట్టాలని కోరారు.అనంతరం నేరేడుచర్ల వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, కౌన్సిలర్లు అమరారపు లలిత భరత్,అలక సరిత సైదిరెడ్డి,తహసిల్దార్ సరిత , ముగ్గురు మహిళా ఉపాధ్యాయులకు  ఐదుగురు అంగన్వాడి సిబ్బందిని పట్టు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పలువురు బాలింత మహిళలకు ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేశారు. తదనంతరం ముఖ్య అతిథులు విచ్చేసిన ప్రముఖులకు ‌ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు.పండగ వాతావరణం లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో వాసవి క్లబ్ డిస్టిక్ క్యాబినెట్ కోశాధికారి రాచకొండ విజయలక్ష్మి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గరిణె అరుణ,డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కందిబండ వాసంతి , వాసవీ,వనితా క్లబ్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొత్తా లక్ష్మణ్, వీరవల్లి శ్రీలతా కోటేశ్వరరావు,గజ్జల కోటేశ్వరరావు, కోశాధికారులు యీగా భాగ్యలక్ష్మి శ్రీనివాసరావు ,పోలిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.