అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
కృష్ణా: కృష్ణా జిల్లా చందర్లపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం అర్థరాత్రి గుర్తి తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా దళితులు, దళిత సంఘం నాయకులు చందర్లపాడులో ధర్నా చేస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూయించి బంద్ ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల నిరసనకు మద్దతు ప్రకటించారు. నందిగామ డీఎస్పీ చాంద్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.