అకాల వర్షంతో భారీ పంట నష్టం

` వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలు, పండ్ల తోటలు
` తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీచి పలు చోట్ల పెంకుటిండ్లు, చెట్లు నేలకొరిగాయి. ఇటుకబట్టీలు వర్షానికి తడిసిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని అన్నదాతలు, చేతికొచ్చే సమయంలో ఇటుకబట్టీలు వర్షానికి కరిగిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌, గోవిందరావుపేట మండలాల్లో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రహదారిపై రాళ్లు కుప్పలుక్పులుగా పడ్డాయి. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో పెంకుటిండ్లు, వరి పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.కొడకండ్ల మండలం గిర్నితండా సవిూపంలో రోడ్డుపై అడ్డంగా భారీ వృక్షం కూలడంతో ఎంపీడీవో, ఏపీవోకు ప్రమాదం తప్పింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గంగాధర, రామడుగు, కరీంనగర్‌, మానకొండూర్‌ మండలాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, బోయినపల్లి, రుద్రంగితోపాటు పలు మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాలు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, కథలాపూర్‌, వెల్గటూర్‌, భీమారం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. భారీ వడగండ్లతో పొట్టదశలోని వరి, నువ్వులు, మామిడి, మిర్చి, చిరుధాన్యాల పంటలు, కూరగాయల తోటలు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి, టమాటా, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. నవాబ్‌పేట మండలం అమ్మాపూర్‌, యన్మన్‌గండ్ల, కొల్లూరు, కోళ్లగుట్టతండా శివారులో ఇటుకల బట్టీలు వర్షానికి తడిసిపోయాయి. వనపర్తి జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆత్మకూర్‌ పట్టణంలో లోతట్టు కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడ, గాంధారి మండలాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మామిడి కాయలు నేలరాలాయి. నిజాంసాగర్‌ మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామ శివారులో ఓ తాటిచెట్టుపై పిడుగు పడిరది.రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది.దీంతో చాలా చోట్ల వ్యవసాయ,ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.. వికారాబాద్‌ జిల్లాలో మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన పడిరది. వికారాబాద్‌ పరిగిపూడూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కాగా రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరువానలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచిన సంగతి తెలిసిందే. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమ యాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం వెల్లడిరచింది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ విూదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుం చి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడుతాయని వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే ఐదు రోజులు యెల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వాతావరణం ఒక్కసారిగా చల్లపడినట్టు తెలిపింది.నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి`భువనగిరి, రం గారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లా ల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగం డ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. శుక్ర, శని, ఆదివా రాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి`భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడిరచిం ది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికా రులు వివరించారు.గ్రేటర్‌ హైదరాబాద్‌  పరిధిలో పలు చోట్ల ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాలతో నగ రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిరది.కొన్ని చోట్ల ఆకాశం లో మెరుపులు.. మేఘాల గర్జనలకు జనం భయపడుతున్నారు. నగ రంలోని గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అవిూర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి రaార్ఖండ్‌ విూదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడటం.. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక విూదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుÑ శుక్ర, శనివారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవచ్చని అంచనావేసింది. ఈ సమయంలో గాలులు వేగం గంటకు 30 నుంచి 40కి.విూల మేర ఉండటంతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇంకోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, మారేడుపల్లి, చిలకలగూడ, సీతాఫల్‌మండీ, అల్వాల్‌, తిరుమల గిరి, ప్యాట్నీ, ప్యారడైజ్‌ తదితర ప్రాంతాల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో భారీగా వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల రహదారులపై వడగళ్లు పేరుకుపోయాయి.
తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.నిన్న ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడా విూదుగా సముద్ర మట్టానికి 0.9 కి.విూ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.రాష్ట్రంలో మరో రెండురోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో  వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పింది. అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు సైతం పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీవిూటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.