అక్టోబర్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మమతాబెనర్జీ ఆందోళన

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యుత్తమ నిర్ణేతలని, వారి తరపున ఉద్యమిస్తామని ఆమె సోమవారం ‘షేస్‌బుక్‌’ పోస్టులో పేర్కొన్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి, ఎల్సీజీ, డీజిల్‌పై రాయితీలకు కోత వంటి నిర్ణయాలని కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు. సామన్య ప్రజల సమస్యల పరిష్కారానికి వారి సహకారంతో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీన జరిగే ఆందోళనలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులకు కూడా చెప్పండి అంటూ మమతా బెనర్జీ తన ‘ఫేస్‌బుక్‌’ అభిమానులను కోరారు.