అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ను కలిసిన భాజపా
హైదరాబాద్: హిందూ మతాన్ని, సంప్రదాయాన్ని కించపరిచేలా మజ్లిన్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన భాజపా ప్రతినిధి బృందం అక్బరుద్దీన్‌పై కఠిన చర్యలు చేపట్టాలని కోరింది. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కె. లక్ష్మణ్, ఎండల లక్ష్మీనారాయణ, గవర్నర్‌ను కలిసిన బృందంలో ఉన్నారు. అక్బరుద్దీన్ చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు న్యాయస్థానాలను ఆశ్రయించారని భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలంటే. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి తెలిపారు.