అక్బరుద్దీన్‌ అరెస్టు

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్య నివేదికలో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వర్రావు ఈరోజు మధ్యాహ్నమే గాంధీ ఆస్పత్రికి వచ్చారు. అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ తలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.