అక్రమంగా పి డి యస్ బియ్యం పట్టివేత యస్ ఐ కొమురెల్లి
కొడకండ్ల, సెప్టెంబర్03 (జనం సాక్షి )
కొడకండ్ల మండలం లోని ఏడునుతల గ్రామంలో పి డి యస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారంతొ ఊరి చివర కాన్వాయ్ గూడెం వెళ్లే దారిలో ఒక బోలెరో వాహనం లో ఉన్న పి డి యస్ బియ్యాన్ని అందులో నుండి వేరే లారీలో లోడ్ చేస్తుండగా లారీని ,బోలెరో వెహికిల్ ని సీజ్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించి, బొలెరో వాహనం లో 30 క్వింటాలు పి డి యస్ బియ్యం,లారీ లో5 క్వింటాలు పి డి యస్ బియ్యన్ని సిజు చేశారు.ముద్దాయిలు దూపటి కార్తీక్,చిలుకల ఆదర్శ్,అంకెళ్ల కృష్ణయ్య,ఎలికట్టే సోమయ్య,ఐత కృష్ణ, 5 గురిపై కేస్ నమోదు చేసునట్లు యస్ ఐ కొమురెల్లి తేలిపేరు.