అక్రమమైనింగ్‌పై కేటీఆర్‌ సీరియస్‌

C

– ఏడీ, రాయల్టి ఇన్స్‌ పెక్టర్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌,జులై 14(జనంసాక్షి): ఇసుక అక్రమ మైనింగ్‌లపై  మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడ్డ పాలమూరు జిల్లాలోని గుడిబండ రీచ్‌ అనుమతిని రద్దు చేశారు. జిల్లా ఏడీతో పాటు.. రాయల్టి ఇన్స్‌ పెక్టర్‌ లను సస్పెండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్‌, ఇసుక తవ్వకాల విూద మంత్రి అధికారులతో వారం రోజులుగా మంత్రి కేటీఆర్‌ సవిూక్షలు జరుపుతున్నారు. గనుల శాఖలోని వివిధ అంశాల విూద చాలాసార్లు సమావేశం అయ్యి కొన్ని అదేశాలు కూడా జారీ చేశారు.  ఏక్కడైనా అక్రమాలు జరిగాయని తెలితే వేంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి అదేశాల మేరకు ఈ బృందం నల్లగొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్న తీరుపై నివేదికలు తెప్పించుకున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రయివేట్‌ పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. జిల్లాలోని గుడిబండ పట్టా భూమిలో అనుమతి ఇచ్చిన భూభాగం పరిమితులు దాటి తవ్వకాలు చేపట్టినట్లు తేల్చారు. ఈ వ్యవహారాలను పరిశీలించాక గనుల శాఖలో వివిధ అంశాలపై మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్న అధికారులపై కొరడా ఝుళిపించారు. అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడీ, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లపై సస్పెండ్‌ చేశారు. టీఎస్‌ ఎండీసీ ఇలంబర్తి, డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌లతో స్పెషల్‌ టీం ఏర్పాటు చేశారు. ఇసుక రీచ్‌, మైనింగ్‌ ప్రాంతాలను పరిశీలించి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇసుక, మైనింగ్‌పై వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మైనింగ్‌ ఆదాయం జాతి సంపద అని అది ప్రజలకే చెందాలని అన్నారు.