అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలి

హైదరాబాద్‌: మద్యం పాలసీ నూతన విధానం ప్రవేశపెట్టేముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భాజపా  అధికార ప్రతినిధి ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు తెలిపిన వారి పేర్లను బహిర్గతం చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెల్టుషాపులను మూసివేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క షాపు కూడా మూసివేయకపోవటం మహ దారుణమని తెలిపారు.