అగ్నిమాపక దళంలో ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ
హైదరాబాద్,ఆగస్టు25(జనం సాక్షి ) : రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక దళంలో 391 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 33 స్టేషన్ ఫైర్ అధికారులు, 284 ఫైర్మెన్లు, 18 జూనియర్ అసిస్టెంట్, 56 డ్రైవర్ ఆపరేటర్ల భర్తీకి అనుమతులు వచ్చాయి. పోలీసు నియామక బోర్డు ద్వారా స్టేషన్ ఫైర్ అధికారులు, ఫైర్ మెన్ పోస్టుల భర్తీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, శాఖా పరమైన ఎంపిక కమిటీ ద్వారా డ్రైవర్, ఆపరేటర్ పోస్టుల భర్తీ జరుగనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



