అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

రామేశ్వరం: తమిళనాడు రాష్ట్ర రామేశ్వరంలోని తొప్పువలసాయి ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. కుటుంబసభ్యులంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.