అగ్రి కెమ్‌ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం: జిల్లాల్లోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నాగార్జున అగ్రి కెమ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో 18 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఇప్పటికే వైద్యాధికారులకు అదేశాలు జారీ చేశారు. వీరిలో 15 మంది శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిళిన ముగ్గుర్ని విశాఖపట్నం తరలించారు.