అజారుద్దీన్‌పై జీవితకాల నిషేధం రద్దు,12 ఏళ్ల తరువాత ఊరట

ఢిల్లీ నవంబర్‌ 8, (జనంసాక్షి)
మాజీక్రికెటర్‌ అజారుద్దీన్‌కు 12 ఏళ్ల తరువాత ఊరట లభించింది ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజారుద్దీన్‌పై 2000లో బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిందే ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్నీన్‌ సిటీ సివిల్‌ కోర్టు నాడు తీర్పును ఇచ్చింది ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసును సుధీర్ఘంగా హైకోర్టు విచారించింది విచారణ అనంతరం అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రద్దు చేస్తూ గురువారం తీర్పునిచ్చింది ఈ తీర్పుతో అజారద్దీన్‌ అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు,అజారుద్దీన్‌కుమ ఊరుట లభించడంతో ఆయన కుటుంబీకులు, బంధువులు వ్యక్తం చేశారు.