అణువిద్యుత్‌కేంద్రంపై చర్చలకు సిద్ధం

కూడంకుళం : కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు అణువ్యతిరేఖ ఉద్యమనేత ఉదయ్‌కుమార్‌ తెలిపారు. కూడంకుళం భద్రతపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించలేదని ఆయన విమర్శించారు. అణుకేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న 250 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.