అణువ్యర్థాలను కేజీఎఫ్‌లో వేసే ప్రతిపాదన లేదు: నారాయణస్వామి
చెన్నై : తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం నుంచి విడుదలయ్యే అణువ్యర్థాలను కర్ణాటకలోని కోలార్ బంగారు గనులు (కేజీఎఫ్)కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి నారాయణస్వామి స్పష్టంచేశారు. అయితే భాజపా నేత అనంతకుమార్ మంత్రి ప్రకటనను కొట్టివేశారు. ఖాళీగా ఉన్న కోలార్ బంగారం గనుల్లో కూడంకుళం అణువ్యర్ధాలను తరలించేందుకు పథకాలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు.



