అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లో విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌ యువత ఆందోళననకు దిగింది. అత్యాచార ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షాంచాలని డిమాండ్‌ చేస్తూ నెక్లెస్‌ రోడ్డులో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. నల్ల దుస్తులు ధరించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. దేశ రాజధానిలోనే మహిళలను రక్షణ లేకుండా పోవడం సిగ్గుచేటని నినాదాలు చేశారు.