అధికారం చేపట్టినప్పుడే అవినీతిపై పోరటం సాధ్యం

హైదరాబాద్‌: అవినీతి నిరోధానికి చేస్తున్న యుద్ధంలో లోక్‌పాల్‌ బిల్లు ఒక అణువు మాత్రమేనని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవినీతి పరిష్కరించడంలో పౌరసమాజం పాత్రపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అవినీతిపై పోరటానికి అన్నా హజారే బృందం రాజకీయాల్లోకి రావడం తప్పేమీ కాదని పౌరసంఘాలు అభిప్రాయపడ్డాయి. అయితే ప్రస్తుత పార్టీలన్నింటినీ ఓడించి అధికారం చేపట్టినప్పుడే అవినీతిపై పోరాటం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డాయి.