అధికారులతో మంత్రి ధర్మాన భేటీ

శ్రీకాకుళం:ఖరీఫ్‌ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ధర్మాన జిల్లా వ్యవసాయ అధికారులను అదేశించారు కలెక్టరు కార్యలయంలో నీటిపారుదల శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు సమీక్ష సమావేశం జరిపారు.ప్రైవేట్‌ మార్కెట్‌కు వెళ్లి రైతులు విత్తనాలు కోనుగోలు చేయకుండా ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడి విత్తనాలనే కోనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు.ఖరీఫ్‌ సాగుకు అవసరమయ్యేంత సాగునీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఆధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ,వివిద శాఖల అధికారులు పాల్గోన్నారు.