అన్నదాతకు వ్యవ”సాయం” ఎన్నడో.
నేలకొరిగిన మొక్కజొన్న.. కదిలిన యంత్రాంగం
పలు పార్టీ నాయకుల పరామర్శలు
తక్షణమే రుణమాఫీ చేయాలంటున్న ప్రతిపక్షాలు
బోనకల్ ,మార్చి 17 (జనంసాక్షి): బోనకల్ మండల వ్యాప్తంగా
అకాల వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను శుక్రవారం రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, మధిర ఏడిఏ కొంగర వెంకటేశ్వరరావు ఏవో అబ్బూరి శరత్ బాబు ఏ ఈ ఓ లు సాధన ,నాగసాయి మండలంలోని ఆళ్ళపాడు, రాయన్నపేట గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షం తమను నట్టేట ముంచిందని రైతులు తమ ఆవేదనను వారికి వివరించారు. ఈ సందర్భంగా రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షం ఈదురుగాలుల వల్ల మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలను సర్వే చేసి వెంటనే సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి నివేదిక పంపిస్తామని తెలిపారు. రైతులను ఆదుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. చివర భూములకు ఒకవైపు నీరంధక మొన్నటి వరకు ఇబ్బంది పడితే నేడు అకాల వర్షం రైతులను కోలుకోని విధంగా దెబ్బతీసిందని వాపోయారు. రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక బిజెపి నేతలతో కలిసి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు గ్రామంలో 30 ఎకరాలు సాగు చేసి మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయిన ఒట్టి కొండ రామకృష్ణ అనే రైతును పరామర్శించిన శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపడంతో పాటు ప్రభుత్వం వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు .అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న రైతులను తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాయన్నపేట గ్రామంలో అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంటలు దెబ్బతినడం వల్ల రైతులకు తీరని నష్టo కలిగిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు దిక్కుతోచని స్థితిలో ఉండి ఆర్థికంగా చితికిపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలపై పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందకుండా పోయి అప్పుల ఊబిలో నెట్టేయబడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిం చి ఆదుకోవాలని, బ్యాంకులలో రుణాలను మాఫీ చేసి భరోసా ఇవ్వాలని కోరారు.మండలంలో తుఫాను కారణంగా అకాల వర్షాలకు మండల వ్యాప్తంగా వేలా ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గరావు అన్నారు.అధికారులు సర్వే చేపట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా ఇన్పుట్ సబ్సిడీని అందించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.లేనియెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల వ్యాప్తంగా తమ నిరసనలు ఉదృతం చేస్తామని తెలియజేశారు.మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామంలో మొక్కజొన్న రైతులకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చిందని ఏ ఐ కె ఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ రాత్రి కురిసిన వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని క్షేత్రస్థాయిలో సర్వే చేయించి రైతులకు మరియు బోనకల్ మండలం లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు కనుక ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికే పత్తికి గిట్టుబాటు ధర లేక మిర్చి ఎర్రన్నల్లితో నష్టపోయి రైతు రుణమాఫీ లేక సాగర కాలవలు సరైన టైం కి అందక తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ,రైతులు, పలు పార్టీల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, స్థానిక ప్రజలు మాట్లాడుతూ నాయకులు అధికారులు పరామర్శలకే పరిమితం అవుతారా లేదంటే సాయాన్ని త్వరితగతిన అందజేసే విధంగా చర్యలు తీసుకుంటారా అంటూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు