అన్నా హజరే నూతన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఒక్కతాటిపైకి రావాలని సామాజిక కార్యకర్త మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడీ సూచించారు. సీబీఐని అధికార పార్టీ కబంద హస్తాల నుంచి బయటకు తేవాటంటే అందుకోసం మాట్లాడుతున్న విభన్న గళాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి. ప్రస్తుతం వేర్వేరుగా పోరాడుతూ కుంభకోణల్లో కూరుకుపోయిన ప్రభుత్వానికి లబ్ధి చేకూరుస్తున్నాం. పటిష్టమైన లోక్‌పాల్‌ ఉద్యమం కోసం సేకరించిన నిధులను ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌ రాజకీయ పార్టీ ఏర్పాటుకు వాడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ అవినీతిపై పోరాటం రాజకీయ ప్రత్యామ్నాయం ఈ రెండింటినీ వేరుగా ముందుకు తీసుకుపోయే నిర్ణయం అవశ్యం జరగాలన్నారు.