అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది..అన్నం పరబ్రహ్మ స్వరూపం

తాండూరు నవంబర్ 27(జనంసాక్షి)అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు .సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి ,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛార ణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
కార్తీక పౌర్ణమి పురష్కరించు కొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహిం చారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమి పురష్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత దంపతులు,పర్వత్ పల్లి సర్పంచ్ పాషాబాయి, ఆలయ పూజారులు భక్తులు తదితరులు ఉన్నారు